
'కేంద్ర ప్రభుత్వంపై కేసులు పెడతాం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ఈనెల 13లోపు ప్రత్యేక హోదా ప్రకటించాలని, లేకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని నటుడు శివాజీ, సీపీఐ నేత రామకృష్ణ, చలసాని శ్రీనివాస్, కారెం శివాజీ హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వంపై కేసులు పెడతామని అన్నారు. ప్రత్యేక హోదా సాధనకు అధికార టీడీపీ సహకరించాలని కోరారు. భావితరాల కోసమే తాము ఉద్యమిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు రాజకీయ పక్షాల మోజులో పడొద్దని సూచించారు.