విభిన్న ప్రతిభావంతులు స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోండి
Published Tue, Oct 25 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో ఇంటర్, ఆపైన చదువుతున్న విభిన్న ప్రతిభావంతుల(అంగవైకల్యం, ఆంధులు, మూగ, బధిరులు, బుద్ధిమాంద్యం, అనాథలు) నుంచి 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమం ఏడీ భాస్కరరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఠీఠీఠీ.్చp్ఛp్చటట.ఛిజజ.జౌఠి.జీn ద్వారా ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకొని ప్రింట్ కాపీని కలెక్టరేట్‌లోని వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రేషన్‌కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరారు.
Advertisement
Advertisement