ఉపకారవేతనాల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి
Published Tue, Oct 4 2016 8:05 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
ఏలూరు (మెట్రో)
ఎస్సీ,ఎస్టీ, బీసీ , మైనార్టీల సంక్షేమశాఖల ద్వారా ఉపకారవేతనాలు పొందేందుకు అర్హత గల విద్యార్థులు ఈ నెల 15వ తేదిలోగా ఆన్‌లైన్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్. షరీఫ్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో నూతన సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రై వేటు కాలేజీ ప్రిన్సిపల్స్‌తో అదనపు జేసీ సమీక్షించారు. ఈ సందర్బంగా అదనపు జేసీ మాట్లాడుతూ ఉపకారవేతనాలు పొందేందుకు అర్హత గల ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థులు తమ పేర్లు సమస్యలుంటే సంబంధిత శాఖల ద్వారా తెలుసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో టెక్నికల్ సమస్యలపై సవరణలు చేసి పంపాలని కాలేజీ ప్రిన్సిపల్స్‌ను అదనపు జేసీ ఆదేశించారు. స్కాలర్‌షిప్ దరఖాస్తులు సకాలంలో ఆన్‌లైన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాలేజీల ద్వారా స్వచ్‌్చభారత్ అమలుకు ప్రిన్సిపల్స్ వాలంటరీ సర్వీస్‌గా పరిసరాలు పరిశుభ్రతకు స్వచ్‌్చభారత్ నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో లీడర్‌షిప్ లక్షణాలు పెంపొందించుకునేందుకు వారిలో చైతన్యం కలగచేయాలని అదనపు జేసీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ట్రై బల్ వెల్ఫేర్ ఆఫీసర్ మల్లిఖార్జునరెడ్డి, సోషల్ వెల్ఫేర డీడీ జే.లక్ష్మిదేవి, బీసీ వెల్పేర్ ఆఫీసర్ జీ. లక్ష్మిప్రసాద్, మైనార్టీ వెల్పేర్ అధికారి హెచ్‌వీ. శేషమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement