పెద్ద నోట్లు చెల్లకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ ఆటో డ్రైవర్ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు
ఆర్మూర్(నిజామాబాద్): పెద్ద నోట్లు చెల్లకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ ఆటో డ్రైవర్ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఆదివారం చోటుచేసుకుంది.
స్థానికంగా నివసిస్తున్న బషీర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే లోన్ తీసుకొని ఆటో కొన్న బషీర్.. పెద్ద నోట్లు చెల్లుబాటు కాకపోవడంతో మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడని తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.