సీసీటీఎన్ఎస్ (క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టం) తో ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు.
పోలీసు వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా క్రైం ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ డిటెక్షన్, సమాచార సేకరణ, దేశమంత వివిధ పోలీసు సంస్థల మధ్య సమన్వయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి సీసీటీఎ¯ŒSఎస్ ప్రాజెక్టును రూపకల్పన చేశారని ఎస్పీ తెలిపారు. ఈ గవర్నె¯Œ్స సూత్రాలను అమలు చేయడం ద్వారా పోలీసుల పనితీరు, దర్యాప్తును శాస్త్రీయంగా మెరుగుపర్చొచని చెప్పారు.