బక్రీద్ స్పెషల్
అనంతపురంలోని మార్కెట్ యార్డు శుక్రవారం కిటకిటలాడింది. శనివారం బక్రిద్ పండుగ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పొట్టేళ్లను పెద్ద ఎత్తున ఇక్కడి తీసుకొచ్చారు. దీంతో ఎంతో మంది ముస్లిం సోదరులు ఇక్కడికి తరలివచ్చి పెద్ద ఎత్తున పొట్టేళ్లను కొనుగోలు చేశారు. కొన్ని పొట్టేళ్లు కొమ్ములు తిరిగి ఎద్దుల్లాగ ఉండటంతో వాటిని కొనేందుకు ఆసక్తి చూపించారు.