మెరుగైన వైద్య సేవలందించాలి
Published Thu, Aug 11 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి
కలెక్టర్ వాకాటి కరుణ
పాఠశాలలు, ఆస్పత్రుల సందర్శన
అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
చిట్యాల : ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో ఇంకా నమ్మకం కలగడం లేదని, మెరుగైన వైద్యసేవలందించి వారిలో విశ్వాçÜం పెంచాలని కలె క్టర్ వాకాటి కరుణ అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలను, జూకల్లు, తిర్మాలాపూర్, చిట్యాల ప్రభు త్వ పాఠశాలలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలల్లో ఏమైనా సమస్యలుంటే హెచ్‌ఎంలు లిఖితపూ ర్వకంగా రాసి ఇవ్వాలని కోరారు.
తిర్మాలాపూర్ పాఠశాల నిర్వహణ సక్రమంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. సివిల్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్, వార్డులను పరిశీలించి సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 113 రోజులలో 100 ప్రసూతి ఆపరేషన్లు చేయడం భేష్ అని వైద్యులను, సిబ్బందిని అభినందించారు. ఆస్పత్రిలో వైద్యుల, సిబ్బంది కొరత లేకుండా చూస్తామన్నారు. అనంతరం వెలిశాలలోని పీహెచ్‌సీని సందర్శించారు. కలెక్టర్ వెంట ములుగు ఆర్డీఓ మహేందర్‌జీ, జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల సంజీవయ్య, జిల్లా ఉపవైద్యాధికారి చల్లా మధుసూదన్, తహశీల్దార్ పాల్‌సింగ్, ఎంపీడీఓ త్రివిక్రమరావు, సూపరింటెండెంట్ వాడే రవిప్రవీణ్‌రెడ్డి, వైద్యులు జయపాల్, తిరుపతి, పద్మ, నవత, అశోక్, శృతి, శ్రీకాంత్ ,మల్లికార్జున్, రాణి ఉన్నారు. అనంతరం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మెుక్కలు నాటారు. బాలికలతో కలిసి భోజనం చేశారు. సౌకర్యాలు, విద్యాబోధనను పరిశీలించి విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ జయశ్రీని అభినందించారు.
అధికారులకు క్లాస్..
మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి అధికారులతో కలెక్టర్ రివ్యూ ని ర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో పర్యవేక్షణ లోపిస్తోందని ఎంఈఓల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పని తీరు మెరుగు పరుచుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరగాలి
రేగొండ : ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా సిబ్బంది చర్యలు చేపట్టాలని కలెక్టర్ వాకాటి కరుణ అ న్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కస్తూర్బా ఆశ్రమ పాఠశాల,హైస్కూళ్లను తని ఖీ చేశారు. ఆస్పత్రి సిబ్బంది పనితీరుపై అగ్రహం వ్య క్తం చేశారు. సీనియర్ అసిస్టెంట్ శాంతిలత కొంత కా లంగా విధులకు రాకపోవడంపై డాక్టర్ కృష్ణవేణిని వి వరణ అడిగారు.
శాంతిలత పనితీరు వివరించడంతో వెంటనే అమెను సరెండర్ చేయాలని,రెండో ఎఎన్‌ఎంలు సమ్మెలో ఉన్నందున వారి వేతనాలు నిలిపివేయాలని ఆదేశించారు. విధులకు సక్రమంగా రాకుంటే చర్య తప్పదని హెచ్చరించారు. అనంతరం కస్తూర్బా ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఉన్నత పాఠశాలను సందర్శించి పరిశుభ్రంగా లేకపోవడంతో హెచ్‌ఎం దేవేందర్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట తహశీల్దార్ శ్రీరాం మల్లయ్య, ఎంపీడీఓ దుబాసి రవీందర్, వీఆర్వోలు శ్రీనివాస్, సుభాష్ ఉన్నారు.
Advertisement
Advertisement