బైక్‌ దొంగలకు బ్రేక్‌ | bike offenders arrest | Sakshi
Sakshi News home page

బైక్‌ దొంగలకు బ్రేక్‌

Published Fri, Sep 30 2016 9:28 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

బైక్‌ దొంగలకు బ్రేక్‌ - Sakshi

బైక్‌ దొంగలకు బ్రేక్‌

ముగ్గురి నుంచి 22 వాహనాల స్వాధీనం 
వీటి విలువ రూ. 6 లక్షలు 
చోరుల్లో ఇద్దరు బాలలు 
విజయవాడ: 
నగరంలో మోటారు బైక్‌లు దొంగిలిస్తున్న ముగ్గురిని సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు బాలలు ఉండడం గమనార్హం. వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన 22 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ముగ్గురు నిందితులు సీసీఎస్‌ పోలీసులకు చిక్కారు, వారిని విచారించగా దొంగతనాలు బైట పడ్డాయి. 
మారుతాళాలతో బైక్‌ మాయం
 నిందితులలో ఒకరు విజయవాడ వాంబేకాలనీకి చెందిన మల్లెల ఎనోష్‌ గవాస్కర్‌ అలియాస్‌ గవ్వా చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. గత 9 నెలల కాలంలో మారుతాళాలను ఉపయోగించి  పటమట పోలీసు స్టేషన్‌ పరిధిలో 11, పెనమలూరులో 1, కృష్ణలంక పోలీసు స్టేషన్‌ పరిధిలో 4 కలిపి మొత్తం మొత్తం 16 బైక్‌లను దొంగిలించారు. జల్సాల కోసం వాటిలో ఒక దానిని అమ్ముకుందామని పటమట ఎన్టీఆర్‌ సర్కిల్‌ సెంటర్‌ సమీపంలోకి రాగా అక్కడ వాహనాలు తనిఖీని గమనించి పారిపోవడానికి యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 
జువెనైల్స్‌ నుంచి 6 బైక్‌లు 
 సీసీఎస్‌  పోలీసులు లెనిన్‌ సెంటర్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు జువెనైల్స్‌ దొరికారు, వారి నుంచి 6బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement