ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ
-
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి
ఆత్మకూరురూరల్ : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ స్థానాలకు బీజేపీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి చెప్పారు. స్థానిక ఏఎంసీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటర్ల చేర్పుపై పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 1987లో ఆంధ్రప్రదేశ్ కౌన్సిలర్ రద్దు అయ్యే నాటికి అధిక సంఖ్యలో బీజేపీ ఎమ్మెల్సీలు ఉన్నారన్నారు. తిరిగి శాసనమండలి పునరుద్ధరింపబడిన తర్వాత బీజేపీ ప్రాతినిథ్యం లేకుండా పోయిందాన్నరు. ఈ ఎన్నికల్లో మిత్రపక్షం టీడీపీ సహకారంతో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో 3 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు అయ్యారని, ఈ దఫా ఎన్నికలకు ఐదు లక్షల మందికి పైగా ఓటర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 2013 అక్టోబర్ నాటికి డిగ్రీ పూర్తి అయిన అందరూ ఓటు హక్కు పొందవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఽఎంపికైన బత్తుల కృష్ణయ్యను సన్మానించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూడు జిల్లాల మండలి ఎన్నికల ఇన్‌చార్జి కందుకూరి సత్యనారాయణ, కిసాన్‌మోర్చా రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు అల్లంపాటి రమణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి సురేంద్రరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కుడుముల సుధాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు కాలం బుజ్జిరెడ్డి, సుధాకర్, మహిళా మోర్చా నాయకురాలు నల్లు కామేశ్వరి, కో ఆప్షన్ సభ్యుడు పఠాన్ మస్తాన్ పాల్గొన్నారు.