తాడిపత్రి : పరిటాల శ్రీరామ్ అనుచరుడు నగేష్ చేతిలో తీవ్రంగా గాయపడిన బోయ ఓబులేసును బుధవారం పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగేష్ కాబోయ భార్య శృతి తనను వేధించాడన్న ఫిర్యాదుతో పోలీసులు బోయ ఓబులేసుపై 294, 506, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తాడిపత్రి కోర్టులో హాజరుపరిచినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.