
హెలికాప్టర్ లో వచ్చి.. గుర్రంపై ఊరేగి..
కామారెడ్డి: పెళ్లిళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తమ కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం రాజంపేటకు చెందిన ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ ముత్యపు మురళి తన కూతురు జలజ వివాహం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కు చెందిన రోహిత్ తో ఈ నెల 20న కామారెడ్డిలో జరపడానికి నిర్ణయించుకున్నారు.
శనివారం సాయంత్రం బీదర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పెళ్లికొడుకు రోహిత్ ను, పెళ్లికొడుకు కుటుంబసభ్యులు ముగ్గురిని కామారెడ్డికి తీసుకువచ్చారు. స్థానిక ఇందిరాగాధీ స్టేడియంలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్ద ఈ హెలికాప్టర్ దిగింది. అల్లుడిని ముత్యపు మురళితోపాటు ఆయన సోదరులు, కుటుంబసభ్యులు సాదరంగా ఆహ్వానించి, గుర్రపు టాంగాపై ఊరేగింపుగా తీసుకెళ్లారు.