హెలికాప్టర్‌లో పెళ్లి మండపానికి... | Bride In maharashtra Village Arrived For Marriage In Helicopter | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌లో పెళ్లి మండపానికి...

Published Fri, Feb 12 2016 10:22 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

ఉపరీ గ్రామంలో దిగిన హెలికాప్టర్ - Sakshi

ఉపరీ గ్రామంలో దిగిన హెలికాప్టర్

సాక్షి, ముంబై: కూతురుపై ఉన్న మమకారమో లేక కుమార్తె పెళ్లి చరిత్రకెక్కాలనుకున్నాడో.. ఓ తండ్రి హెలికాప్టర్‌లో పెళ్లి కూతురిని మండపానికి తీసుకెళ్లాడు. మహారాష్ట్రలోని పంఢర్‌పూర్ తాలుకా ఉపరీ గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి దత్తత్రయ్ మోహితే.. సాంగ్లీ జిల్లాలోని ఆట్పాడికి చెందిన సూరజ్ కదంతో తన కూతురు ప్రాజక్త వివాహం నిశ్చయించారు.

కట్ చేస్తే.. బుధవారం ఉదయం 11 ప్రాంతంలో గ్రామంలో హెలికాప్టర్ దిగింది. హెలికాప్టర్ ఉళ్లోకొచ్చిందని తెలుసుకున్న ప్రజలు చూడటానికి క్యూకట్టారు. హెలికాప్టర్ ఊళ్లోకి ఎందుకొచ్చిందా అనుకుంటుండగా... పెళ్లి కూతురుని మండపానికి తీసుకెళ్లడానికి వచ్చిందని తెలుసుకొని అవాక్కయ్యారు. ప్రాజక్త, సూరజ్ వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement