పరీక్ష రాసి పెళ్లిపీటల మీదకు..
పరీక్ష రాసి పెళ్లిపీటల మీదకు..
Published Sat, Nov 26 2016 1:12 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
ఆదిలాబాద్ జిల్లా మావల మండలం సరస్వతీనగర్‌కు చెందిన ఆలూరి రచన పెళ్లి శుక్రవారం ఉదయం 11.07 గంటలకు ఆదిలాబాద్‌లోని ఓ గార్డెన్‌లో ఉంది. ఆమె డీఎడ్ చదువుతోంది. ఇదే రోజు ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో డీఎడ్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో రచన తన తల్లిదండ్రులను ఒప్పించి మెథడాలజీ పరీక్షకు హాజరైంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉండగా.. 11 గంటలకు పరీక్ష ముగించుకుని బయటకు వచ్చింది. ఆ తర్వాత పెళ్లి కుమారుడు వెటర్నరీ డాక్టర్ సాగర్‌తో పెళ్లి జరిగింది. త్వరలో ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించే అవకాశాలు ఉండడంతో పరీక్షకు హాజరైనట్లు పెళ్లికూతురు రచన పేర్కొంది.
Advertisement
Advertisement