
ప్రశాంతంగా ఎంసెట్ కౌన్సెలింగ్
నెల్లూరు(టౌన్): ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. దర్గామిట్టలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 291మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. 100 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 284 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. 52 మంది విద్యార్థులు ఆప్షన్లను ఎంపిక చేసుకున్నారు.
శుక్రవారం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 50,001 నుంచి 57,500 ర్యాంకు వరకు, ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 57,501 నుంచి 65000 ర్యాంకు వరకు సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్లుగా కళాశాలల ప్రిన్సిపళ్లు నారాయణ, రామమోహన్ వ్యవహరించారు.