హాకీలో సత్తాచాటిన ఆంధ్ర జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–19 హాకీ పోటీల్లో ఆంధ్ర బాల, బాలికల జట్లు తమ సత్తా చాటుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరుగుతున్న జాతీయస్థాయి హాకీ పోటీల్లో బాలికల జట్టు జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 11–0తో విజయకేతనాన్ని ఎగరేసింది. హేమలత–3, పుష్ప–1, హిమబిందు–4 గోల్ సాధించారు. జిల్లాకు చెందిన జ్యోతి–3 గోల్‌లు చేసి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించింది. తమిళనాడుతో జరిగిన మ్యాచ్ 2–2తో డ్రాగా ముగిసింది. బాలుర హాకీ జట్టు సీబీఎస్ జట్టుతో తలపడగా 2–0 తో విజయకేతనాన్ని ఎగరేసింది. జట్టులో ఉదయ్–1, గంగాధర్–1, గోల్స్ చేశారు. జట్టు ప్రదర్శన సంతోషాన్నించ్చిందని అండర్–19 స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర బాలికల జట్టులో జిల్లా నుంచి ఐదు మంది, బాలుర జట్టులో ముగ్గురు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.