ముకరంపుర : ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభ్తువం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు విమర్శించారు. జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిని గురువారం సందర్శించి మాట్లాడారు. రోగులను పరామర్శించారు. ఆస్పత్రిలోని అధ్వాన పరిస్థితులకు నిరసనగా అక్కడే ధర్నా నిర్వహించారు. సుగుణాకర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల పాలనలో రోగగ్రస్థ తెలంగాణగా మారిందన్నారు. ప్రజారోగ్యంపై శ్రద్ధచూపకపోవడంతో పేదలు ప్రై వేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో మందులు, సౌకర్యాల కోసం కేంద్రం గతేడాది రూ.1105 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.400 కోట్లను వినియోగించలేదని ఆరోపించారు. ఆస్పత్రిని మరమ్మతు చేయించడంతోపాటు సిబ్బందిని నియమించాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మిర్యాల్‌కర్ నరేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి శంకర్, పార్లమెంట్ కన్వీనర్ హరికుమార్‌గౌడ్, నాయకులు ఆనంద్, బోళ్ల వేణు, కూడల శిరీష్, జేడీ భగవాన్, ములుగూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.