నిరాశే..
అంచనాలు తారుమారు
అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో లేదని తేల్చిన కేంద్రం
నిజామాబాద్ : అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు 2026 వరకు లేనట్లేనని కేంద్రం తేల్చి చెప్పడంతో జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లరుుంది. అలాగే ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్న ప్రధాన పార్టీల నేతల్లోనూ ఒకింత అభధ్రత భావానికి దారితీస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఈ పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలున్నారుు. నియోజకవర్గాల పునర్విభజనలో అదనంగా మరో రెండు పెరుగుతాయని, ఆయా పార్టీలో మరో ఇద్దరు ముఖ్యనేతలకు అవకాశాలకు వీలుందనే ఆశతో ఉన్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌లోకి రానున్న రోజుల్లో కాంగ్రెస్, టీడీపీల నుంచి చేరికలుంటాయనే చర్చ జోరుగా సాగింది. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్ నాయకురాలు ఏలేటీ అన్నపూర్ణమ్మ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం చాలా రోజులుగా ఉంది.
అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడి కారెక్కే అవకాశాలు లేకపోలేదనే భావన స్థానిక రాజకీయ వర్గాల్లో ఉంది. ఓ స్థారుులో బోధన్‌కు చెందిన మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డిలు కూడా టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారనే ప్రచారమూ జరిగింది. నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లోనైతే ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో నలుగురైదుగురు బలమైన నేతలున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పెంపు ఉండదని కేంద్రం తేల్చి చెప్పడంతో ఆయా స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతల అంచనాలన్నీ తారుమారయ్యారుు. దీనికి తోడు జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేల పనితీరుపై కొంత విమర్శలున్నారుు. పార్టీ శ్రేణులతోపాటు, సీఎం కేసీఆర్ కూడా వీరి పనితీరుపై అసంతృప్తితో ఉన్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పెంపు లేకపోవడం.. ఇతర పార్టీ నేతలు టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతుండటంతో ఈ ఒకరిద్దరు ఎమ్మెల్యేల్లోనూ ఒకింత అభధ్రతా భావానికి దారి తీసినట్లవుతోందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్‌లో..
నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేకపోవడం కాంగ్రెస్ పార్టీలోనూ ప్రభావం చూపుతోంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఇన్‌చార్జీగా, పీసీసీ అధికార ప్రతినిధి మహేష్‌కుమార్‌గౌడ్ ఉన్నారు. అవకాశం వస్తే పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ కూడా ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్ హందాన్‌లతోపాటు మరో ఇద్దరు నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నారుు. నియోజవర్గాల పునర్విభజనతో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఒకరిద్దరికి అదనంగా సర్దుబాటుకు అవకాశం లభిస్తుందని భావించారు. కానీ ఈ ఆశలపై నీళ్లు చల్లినట్లరుుంది.
అంచనాలు.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లాలో ఐదు నియోజకవర్గాల పరిధిలో అదనంగా రెండు పెరిగే అవకాశాలుండేవి. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల పరిధిలో అదనంగా ఒక నియోజకవర్గం (బోధన్ నియోజకవర్గం నుంచి ఒకటీ రెండు మండలాలను కలుపుకుని..) ఏర్పడే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేశారుు. అలాగే ఆర్మూర్, బాల్గొండ రెండు నియోజకవర్గాల పరిధిలో మరో నియోజకవర్గం పెరిగే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తం మీద ప్రస్తుతముతన్న ఐదు నియోజకవర్గాలు ఏడుకు చేరనున్నట్లు అంచనా వేశారు. కానీ తాజాగా కేంద్ర ప్రకటనతో ఈ అంచనాలన్నీ తలక్రిందులైనట్లరుుంది.