వైభవంగా బ్రహ్మోత్సవాలు
బుక్కపట్నం : కొత్తచెరువు మండలం చెన్నకేశవపురంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ధర్మకర్తలు ఉషారాణి, చెన్నారెడ్డి.. స్వామికి పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. అంతకుముందు గణపతి, లక్ష్మీదేవి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం గంగపూజలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆలయం వేద పండితుల మంత్రోచ్చారణలతో మార్మోగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు.
ఆలయంలో ఉదయం 8 గంటలకు ధ్వజారోహణ, అంకురార్పణ, పూజ, సాయంత్రం 4 గంటలకు మహాభిషేకం నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు, హోమాలు, సాయంత్రం 4 గంటలకు సుదర్శన హోమం, గరుడ వాహనసేవ, ఆదివారం ఉదయం 4 గంటలకు ద్వారక ప్రవేశం, 8 గంటలకు హోమాలు, పూర్ణాహుతి, నూతన కల్యాణ వేదిక ప్రారంభోత్సవం, కల్యాణ మహోత్సవం, సాయంత్ర 4 గంటలకు చక్రస్నానం, ధ్వజారోహణ, శ్రీవారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
రేపు చెన్నకేశవపురం రానున్న డాక్టర్ శోభారాజు
బుక్కపట్నం : అన్మమయ్య కీర్తనలను తన గాత్రంతో భక్తులను మైమరపింపజేసే ప్రఖ్యాత గాయని అన్నమయ్య పదకోకిల, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు ఆదివారం చెన్నకేశవపురం విచ్చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు శ్రీమతి ఉషారాణి, చెన్నారెడ్డి దంపతులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో ఆమె కీర్తనలు ఆలపిస్తారన్నారు.