దినకర్మకు వెళ్లి.. మృత్యుఒడికి | child death in keshampet | Sakshi
Sakshi News home page

దినకర్మకు వెళ్లి.. మృత్యుఒడికి

Published Thu, Aug 18 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

నర్సింహులు మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి, బంధువులు

నర్సింహులు మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి, బంధువులు

కేశంపేట :  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఆవరణలో తవ్వి అర్ధాంతంగా వదిలివేసిన ఇంకుడుగుంత ఓ బాలుడి పాలిట మత్యువుగా మారింది.. అధికారుల నిర్లక్ష్యంతో ఏడేళ్లకే అతడికి నూరేళ్లు నిండాయి.. తల్లిదండ్రులతో కలిసి బంధువు దినకర్మకు వెళ్లగా ఈ సంఘటన చోటుచేసుకోవడం అక్కడి వారినందరినీ కలచివేసింది. మండల కేంద్రానికి చెందిన జయమ్మ, రమేష్‌ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండోవాడు అన్నంగారి నర్సింహులు (7) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. కాగా, బుధవారం ఉదయం బంధువు దశదినకర్మ ఉండటంతో పాఠశాలకు వెళ్లలేకపోయాడు. 
 ఈ క్రమంలోనే తల్లిదండ్రులు, తాత నర్సిములుతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. వారంతా ఆ కార్యక్రమంలో నిమగ్నం కాగా, ఈ బాలుడు మాత్రం తోటి పిల్లలతో కలిసి సమీపంలోని పీహెచ్‌సీ ఆవరణలో ఆడుకోవడటానికి వెళ్లాడు. కొద్దిసేపటికి ప్రమాదవశాత్తు అక్కడే ఇంకా పూర్తికాని ఇంకుడుగుంతలో పడ్డాడు. మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో తాత చుట్టుపక్కల వెతుకుతూ అందులో మనవడు కొనఊపిరితో ఉండగా గమనించి బయటకు లాగారు. హుటాహుటిన షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యంతోనే బాలుడు మతి చెందాడని బంధువులు, గ్రామస్తులు ఆరోపించారు. ఇంకుడుగుంతను అర్ధంతరంగా వదిలేయడంతో ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ కష్ణయ్య కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
    పోస్టుమార్టం అనంతరం మతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పరామర్శించి రూ.ఐదు వేలు, టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు లక్ష్మీనారాయణ రూ.మూడు వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement