
టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీలో చేరిక
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పెద్దిరెడ్డి
పుంగనూరు (సోమల): సోమల మండలం కందూరులో జరిగిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీలో చేరారు. పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిలో కందూరుకు చెందిన మైనారిటీ నేత కాలేషా , పగడాలవారిపల్లెకు చెందిన యువనేత శివశంకర్ ఉన్నారు.
కార్యక్రమంలో తంబళ్లపల్లె నియోజకవర్గం వైఎస్సార్ సీపీ కన్వీనర్ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, లిడ్ క్యాఫ్ మాజీ చైర్మన్ ఎన్. రెడ్డెప్ప సీనియర్ నేతలు నాగరాజారెడ్డి, నాగేశ్వరరావు, ఎల్. రాజారెడ్డి, బెంగళూరు సాంబయ్య మండల పార్టీ అధ్యక్షుడు గంగాధరం, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి రవీంద్రరెడ్డి, నాయకులు నాగభూషణం రెడ్డి, చంద్రశేఖర్‌నాయుడు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.