చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం
చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం
Published Wed, Apr 12 2017 12:36 AM | Last Updated on Fri, Oct 5 2018 6:24 PM
అమడగూరు : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరీ దేవి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రారంభమైన కుంభకూడు కార్యక్రమాన్ని దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో దొనకొండ వెంకటరమణ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ముత్యాల జొన్నలతో వండిన కూడును అమ్మవారి ఎదుట ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కుంభం వలే రాశిగా పోసి. పూల కుచ్చును ఏర్పాటు చేశారు. ఆనవాయితీ ప్రకారం జంతు బలి ఇచ్చారు. కుంభకూడు కార్యక్రమానికి మండల వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Advertisement
Advertisement