ఘనంగా చౌడేశ్వరి రథోత్సవం | chowdeswari rathothsavam in kotipi | Sakshi
Sakshi News home page

ఘనంగా చౌడేశ్వరి రథోత్సవం

Published Fri, Mar 31 2017 11:44 PM | Last Updated on Fri, Oct 5 2018 6:24 PM

ఘనంగా చౌడేశ్వరి రథోత్సవం - Sakshi

ఘనంగా చౌడేశ్వరి రథోత్సవం

హిందూపురం రూరల్‌ : మండలంలోని కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వరి అమ్మవారి రథోత్సవం శుక్రవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రతి ఏటా ఉగాది పండుగ తర్వాత రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గొర్రెలు, మేకలను బలి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం అమ్మవారి మూలవిరాట్‌ విగ్రహాన్ని ఊరేగింపుగా మేళతాళాలతో తీసుకువచ్చి రథోత్సవంపై కొలువుదీర్చారు.

అనంతరం అమ్మవారి నామస్మరణల నడుమ భక్తులు రథాన్ని ముందుకు లాగారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు బెంగళూరు, గౌరిబిదనూరు తమిళనాడు నుంచి అమ్మవారు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై అమ్మవారికి చీర, సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement