ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సీఎం కేసీఆర్ | Cm KCR people beaten buridi | Sakshi
Sakshi News home page

ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సీఎం కేసీఆర్

Published Sun, Jul 17 2016 1:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సీఎం కేసీఆర్ - Sakshi

ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సీఎం కేసీఆర్

బీజేపీ ఓబీసీ మోర్చా సదస్సులో రాష్ట్ర అధ్యక్షుడు వన్నాల శ్రీరాములు
 

హన్మకొండ : సీఎం కేసీఆర్ ప్రజలను మాటల గారడితో బురిడీ కొట్టిస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వన్నాల శ్రీరాములు దుయ్యబట్టారు. శనివారం హన్మకొండ హంటర్‌రోడ్‌లోని వేద బాంక్వెట్‌హాల్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని చెబుతున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాల కోసం జిల్లాలో 1.70లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 1700 మందిని ఎంపిక చేసి పైసా ఇవ్వలేదన్నారు.


సీఎం పనిచేస్తున్న కార్యాలయం లో, జిల్లా కలెక్టర్‌లు, ఎస్పీలుగా బీసీలు లేరన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటం నర్సింహాయాదవ్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగవెల్లి యుగెందర్, వలబోజు శ్రీనివాస్, కర్నాటి ధనుంజయ, డాక్టర్ టి.విజయలక్ష్మి, రవీందర్, నాగపురి రాజమౌళి, బొడిగ గట్టయ్య, ప్రొఫెసర్ వెంకటనారాయణ, శ్రీరాముల మురళీమనోహర్, నాంపల్లి యాకయ్య, నాగారపు వెంకట్, శివలాల్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement