గిరి పుత్రుడికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
Published Sun, Jul 24 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
గిర్నిబావి(దుగ్గొండి) : విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్‌లో సీటు సంపాదించిన నూనావత్ విశాల్ ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.లక్ష మంజూరైంది. ఈ మేరకు చెక్కును విశాల్ తల్లిదండ్రులు రాందన్–వినోదకు టీఆర్‌ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం అందజేశారు.
మండలంలోని పిల్లిగుండ్ల తండాకు చెందిన విశాల్‌కు విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిల్ స్కూల్‌లో సీటు లభించింది. హాస్టల్, తదితర ఖర్చుల కింద రూ.లక్ష డిపాజిట్ చేయాలని పేర్కొనడంతో.. ఆయన తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. ఈ విషయమై మార్చి 17న ‘సాక్షి’లో ‘గిరిపుత్రుడిని ఆదరించరూ’ శీర్షికన కథనం కూడా ప్రచురితమైంది. ఈ మేరకు అప్పట్లో ఎస్సై వెంకటేశ్వర్లు కొంత ఆర్థికసాయం అందించగా.. టీఆర్‌ఎస్ నేత సుదర్శన్‌రెడ్డి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేయించారు. దీంతో చెక్కు రాగా, ఆదివారం విశాల్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా రాందన్–వినోద మాట్లాడుతూ తమకు తోడ్పాటునందించిన సాక్షి దినపత్రికు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ లావుడ్యా లలితతో పాటు ఆకుల శ్రీనివాస్, నర్సింహారెడ్డి, మహిపాల్‌రెడ్డి, గుడిపెల్లి జనార్ధన్‌రెడ్డి, ఎర్రల్ల బాబు, కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, నాతి వెంకటేశ్వర్లు, మేర్గు రాంబాబు, కృష్ణ పాల్గొన్నారు.
Advertisement