రేపటిలోగా పనులు పూర్తికావాలి | complete works tasks within one day | Sakshi
Sakshi News home page

రేపటిలోగా పనులు పూర్తికావాలి

Published Wed, Oct 5 2016 7:35 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

కలెక్టరెట్‌ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ - Sakshi

కలెక్టరెట్‌ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌

మెదక్‌: కలెక్టరేట్‌ భవన సముదాయ పనులు ఈనెల 7వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మెదక్‌ పట్టణ శివారులోని పిల్లికొట్టాల్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న నూతన జిల్లా కలెక్టరేట్‌ (రాయల్‌ డిగ్రీ కళాశాల)ను సందర్శించారు. ఈ సందర్భంగా పలు విభాగాలు, శాఖల కోసం ఏర్పాటు చేస్తున్న గదులు, ఫర్నిచర్‌ను పరిశీలించారు.

దసరారోజు కలెక్టరేట్‌ ప్రారంభానికి సీఎం కేసీఆర్‌ వస్తున్నారని, రోడ్లు, భవన సముదాయ పనులు  పకడ్బందీగా చేపట్టాలని  ఆదేశించారు. కళాశాలలో కొనసాగుతున్న చిన్న చిన్న మరమ్మతు పనులను వేగవంతం చేయాలని యాజమాన్యానికి సూచించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్‌రాగి అశోక్‌తోపాటు పలు శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement