ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్‌ నేతలు | Congress leaders have lost credibility among the people | Sakshi
Sakshi News home page

ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్‌ నేతలు

Jan 25 2017 9:57 PM | Updated on Mar 18 2019 9:02 PM

ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్‌ నేతలు - Sakshi

ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్‌ నేతలు

ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్‌ నేతలు మరోసారి ఎంపీ వినోద్‌కుమార్‌పై అవాకులు చె వాకులు పేలితే

న్యూశాయంపేట :  ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కాం గ్రెస్‌ నేతలు మరోసారి ఎంపీ వినోద్‌కుమార్‌పై అవాకులు చె వాకులు పేలితే జనం తరిమి కొడతారని  టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి  రవీందర్‌రావు అన్నారు. మంగళవారం హన్మకొండ రాంనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మచ్చలేని వ్యక్తి ఎంపీ వినోద్‌కుమార్‌పై పొన్నం ప్రభాకర్‌ వి మర్శలు చేయడం ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ నుంచి గల్లీ దా కా వచ్చి సవాళ్లు విసురుతున్న తీరు చూస్తే వారి మానసిక స్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్రాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుడంతో  ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారన్నా రు.

  అనంతరం గొర్రెలు,మేకల పెంపకందారుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్యయాదవ్‌ మాట్లాడుతూ మాజీ ఎంపీగా హుందాతనంతో మాట్లాడాల్సిన పొన్నం పొన్నం ప్రభాకర్‌ పిల్లాడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.  చేసిందే చెప్పే వ్యక్తి ఎంపీ వినోద్‌కుమార్‌ గురించి మాజీ ఎంపీ పొన్నం ఒంకర టింకరగా మాట్లాడం తగదని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కమలాపూర్‌ ఏర్పా టు కానున్న ఎల్‌పీజీ గ్యాస్‌ ప్లాంట్‌  మంజూరు అయింది కాం గ్రెస్‌ హయాంలో అయినా ఎంపీ వినోద్‌కుమార్, మంత్రి ఈ టల రాజేందర్‌ కృషితో పూర్తిస్తాయి పరిపాలన అనుమతులు వచ్చాయన్నారు.  సమావేశంలో నాయకులు గుడిమళ్ల రవికుమార్, జన్ను జకార్య, కార్పొరేటర్లు జోరిక రమేష్, చింతల యాదగిరి, మైనారిటీ నాయకుడు ఎండీ.నయీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement