
'కాంగ్రెస్, టీడీపీలు దుష్ప్రచారాన్ని మానుకోవాలి'
కరీంనగర్: తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నేతలపై కరీంనగర్ ఎంపీ వినోద్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ స్పందించడం లేదంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్,టీడీపీలు మానుకోవాలన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వినోద్.. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలవడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. ప్రస్తుతం లోక్ సభలో ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనా?టీఆర్ఎస్ పార్టీనా?అనే పరిస్థితి ఏర్పడిందని వినోద్ ఎద్దేవా చేశారు.