మంత్రుల ఇళ్లను ముట్టడించిన ఏఎన్‌ఎంలు | contract ANM protest for 10th PRC | Sakshi
Sakshi News home page

మంత్రుల ఇళ్లను ముట్టడించిన ఏఎన్‌ఎంలు

Published Sat, Aug 20 2016 2:30 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

contract ANM protest for 10th PRC

హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఏఎన్‌ఎంలు మంత్రుల నివాసాలను ముట్టడిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరులోని మంత్రి మహేందర్‌రెడ్డి నివాసాన్ని కాంట్రాక్టు ఏఎన్‌ఎం-2లు ముట్టడించారు. పదో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని గత నెల 18వ తేదీ నుంచి ఆందోళనలు సాగిస్తున్నా ప్రభుత్వం స్పందించటం లేదని ఆరోపించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే గొంగిడి సునీత నివాసాన్ని ఏఎన్‌ఎంలు ముట్టడించగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసులు అడ్డగించారు. దీంతో ఏఎన్‌ఎంలు ప్రభుత్వానికి, అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే, నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడలోని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని కూడా కాంట్రాక్టు ఏఎన్‌ఎం-2లు ముట్టడించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement