Contract Anm
-
మంతి నిజాయితీ!
పనివేళల్లో సరిగా పనిచేయకుండా ముచ్చట్లతో కాలక్షేపం చేసే ఈ రోజుల్లో ‘మంతి కుమారి’ నదులు, గుట్టలు దాటి అడవుల్లోకి సైతం కాలినడకన వెళ్లి విధులు నిర్వర్తిస్తోంది. జార్ఖండ్‌లో కాంట్రాక్ట్ ఏఎన్ఎమ్గా పనిచేస్తోన్న మంతి కుమారి తన ఏడాదిన్నర పాపను వీపున కట్టుకుని పసిపిల్లల్లో రోగనిరోధకతను పెంచే టీకాలు వేస్తున్నారు. వయసు, సీజన్‌ను బట్టి చిన్నారులకు రెగ్యులర్‌గా అందించాల్సిన మందులను వైద్య సదుపాయంలేని మారుమూల ప్రాంత చిన్నారులకు అందించేందుకు బుర్రా నదిని దాటి మరీ సేవలందిçస్తుండడం విశేషం. గతేడాది జనవరిలో చెట్మా హెల్త్ సబ్ సెంటర్లో ఉద్యోగంలో చేరిన మంతి కుమారి అప్పటినుంచి వ్యయప్రయాసలను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ కాలంలో మంతి భర్త సునీల్ ఓరాన్ ఉద్యోగం పోవడంతో మంతి ఉద్యోగమే కుటుంబ పోషణకు ఆధారం అయ్యింది. దీంతో మంతి చుట్టుపక్కల ఉన్న ఎనిమిది గ్రామాల వారికి ఆరోగ్య సేవలందిస్తున్నారు. తిసియా, గోరియా, సుగబంద్ గ్రామాలకు నెలకు ఒక్కసారైనా వెళుతుంది. ఈ గ్రామాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా నది దాటాల్సి వస్తుంది. కొంత దూరం వరకు తన భర్త బండిమీద దింపినప్పటికీ..మిగతా దూరం తను ఒక్కటే ప్రయాణిస్తోంది. ‘‘నేను విధులు నిర్వర్తిస్తోన్న ప్రాంతంలో సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం వల్ల తప్పనిసరిగా నదులు దాటాల్సి వస్తుంది. అయితే ఈ నదులు లోతు తక్కువగా ఉండడం వల్ల ధైర్యంగా దాటగలుగు తున్నాను. వర్షాకాలంలో నదిలో నీళ్లు ఎక్కువైతే అప్పుడు ఆయా గ్రామాలకు వెళ్లను. రోజూ నా డ్యూటీలో భాగంగా మహద్నార్ మొత్తం 25 కిలోమీటర్లు పరిధిలోని గ్రామాలను కవర్ చేస్తాను. వారానికి ఆరు రోజులు నేను డ్యూటీ చేయాల్సి ఉంటుంది. దట్టమైన అడవులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వైద్యసదుపాయాలు తక్కువగా ఉంటాయి. నాలాంటి ఏఎన్ఎమ్ సేవలైనా వాళ్లకు అందాలన్న ఉద్దేశ్యంతో కాస్త కష్టమైనా ముందుకు సాగుతున్నాను’’ అని మంతి కుమారి వివరించింది. ‘‘చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల ఆరోగ్య కార్యకర్తలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మంతి తన కూతుర్ని వీపుపై కట్టుకుని ప్రయాణించి మరీ విధులు నిర్వర్తించడం నిజంగా ప్రశంసనీయం’’అని చెట్మా హెల్త్ సబ్‌సెంటర్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. -
మంత్రుల ఇళ్లను ముట్టడించిన ఏఎన్ఎంలు
హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఏఎన్ఎంలు మంత్రుల నివాసాలను ముట్టడిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరులోని మంత్రి మహేందర్‌రెడ్డి నివాసాన్ని కాంట్రాక్టు ఏఎన్ఎం-2లు ముట్టడించారు. పదో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని గత నెల 18వ తేదీ నుంచి ఆందోళనలు సాగిస్తున్నా ప్రభుత్వం స్పందించటం లేదని ఆరోపించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే గొంగిడి సునీత నివాసాన్ని ఏఎన్ఎంలు ముట్టడించగా టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు అడ్డగించారు. దీంతో ఏఎన్ఎంలు ప్రభుత్వానికి, అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే, నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడలోని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని కూడా కాంట్రాక్టు ఏఎన్ఎం-2లు ముట్టడించారు. -
వరదకాలువలో పడి నర్సు మృతి
డక్కిలి (నెల్లూరు జిల్లా) : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా పనిచేస్తున్న పైడిపాటి వెంకట రాజ్యలక్ష్మి (35) డక్కిలి-కమ్మపల్లి మార్గంలోని వాగులో పడి సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే ఆమె మృతి విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు కథనం మేరకు.. సోమవారం ఆసుపత్రిలో విధులు ముగించుకుని స్కూటీ మీద ఇంటికి వెళ్తుండగా కమ్మపల్లి సమీపంలోని మలుపు వద్ద వాగు వరద ప్రవాహం రోడ్డుపై ప్రవహిస్తుంది. అదే సమయంలో ఇంటికి వెళ్తున్న రాజ్యలక్ష్మి రోడ్డుమార్గం సక్రమంగా కనపడకపోవడంతో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందువల్ల పైకి లేవలేకపోవడంతో వాగులోనే ఇరుక్కుని అక్కడికక్కడే మృతిచెంది ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వస్తానని బంధువులకు వెంకట రాజ్యలక్ష్మి ఫోన్లో తెలియజేసింది. 7 గంటలకు విధులు ముగించుకుని బయలుదేరిన ఆమెను మార్గమధ్యంలోని వాగు మృత్యువు రూపంలో కబళించింది. సంఘటనాస్థలంలో మిన్నంటిన రోదనలు.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న వెంకటరాజ్యలక్ష్మి ఆసుపత్రికి వచ్చే రోగులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వైద్య సేవలు అందించేది. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తున్న ఆమె పట్ల సహ ఉద్యోగులకు కూడా మంచి అభిప్రాయం ఉంది. వెంకట రాజ్యలక్ష్మి రేషన్‌షాపు డీలర్‌గా కూడా పని చేస్తుంది. పేద ప్రజలకు రేషన్ సరుకులు నిజాయితీగా అందిస్తు వారి మన్ననులు కూడా పొందుతుండేది. వాగులో పడి ఆమె అకాల మరణం చెందడంతో ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు, బంధువులు సంఘటనాస్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతిచెందిన తీరుని తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెతో కలిసి పనిచేసే స్థానిక వైద్య సిబ్బంది బోరున విలపించారు. నీళ్లల్లో ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి శవపరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన ఆధికారులు.. వరదకాలువలో పడి మృతి చెందిన ఏఎన్ఎం వెంకటరాజ్యలక్ష్మి మృతదేహాన్ని తహశీల్దార్ రాజ్‌కుమార్, వెంకటగిరి సీఐ ఎం శ్రీనివాసరావు, వైద్యాధికారి సుధీర్‌బాబు తదితరులు పరిశీలించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.అక్కడ నుండి తహశీల్దార్ రాజ్‌కుమార్, గూడూరు సబ్‌కలెక్టర్ గిరిషాకి కూడా ఫోన్ ద్వారా తెలియజేశారు. -
కానరాని కాంట్రాక్టు సేవలు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను న్యూస్‌లైన్ బృందం సోమవారం జిల్లావ్యాప్తంగా పరిశీలించింది. ఈ పరిశీలనలో..గ్రామీణులకు వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం ప్రస్ఫుటమైంది. జిల్లాలో 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ప్రతి 5 వేల జనాభాకు ఒక రెగ్యులర్ ఏఎన్ఎం గ్రామాల్లోని సబ్సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి అదనంగా రెండో ఏఎన్ఎంలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. మొత్తం 540 సబ్సెంటర్లకుగాను 535 మంది కాంట్రాక్టు ఏఎన్ఎంలు జిల్లాలో ఉన్నారు. స్థానికంగా గ్రామాల్లోనే ఉండి వైద్యసేవలందించాల్సిన వారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పనిచేసే చోటే నివాసం ఉండాలన్న నిబంధనకు పాతరేస్తున్నారు. అగ్రిమెంట్‌ను కాలరాస్తున్న వైనం.. స్థానికంగా ఉంటామని స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ చేస్తేనే రెండో ఏఎన్ఎంను విధుల్లోకి తీసుకుంటారు. ఏ మండలంలో విధులు నిర్వహించాల్సిన సెకండ్ ఏఎన్ఎంలను ఆ మండల పరిధి నుంచే ఎంపిక చేయాలి. కానీ అభ్యర్థులు లభ్యం కావడం లేదన్న సాకుతో అధికారులు ఇతర మండలాలకు చెందిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేయడంతో వారు పనిచేసే చోట నివాసం ఉండటం లేదు. గర్భిణులు, శిశువులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, పిల్లలు, బాలింతలు గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయడం, గర్భిణుల బరువు, ఎత్తు ప్రతినెలా నమోదు చేయడం, వారికి ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలివ్వడం వంటివి చేయాలి. తాత్కాలిక గర్భ నిరోధక పద్ధతుల గురించి అవగాహన కల్పించడం, కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలను ప్రోత్సహించాలి. గర్భిణులకు ఐరన్, ఫోలిక్ మాత్రలివ్వడం, ప్రసవం కోసం పీహెచ్‌సీలకు తీసుకెళ్లాలి. 24 గంటలూ గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండాలి. పట్టణాలు, మండల కేంద్రాల నుంచి రాకపోకలు.. గ్రామాల్లో స్థిర నివాసం ఉండి వైద్యసేవలందించాల్సిన సెకండ్ ఏఎన్ఎంలు పట్టణాలు, మండల కేంద్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొంత మంది వారానికి ఒకసారి కూడా సబ్‌సెంటర్ మొహం చూడటం లేదు. ఏఎన్ఎంలు గ్రామాల్లో బుధ, శనివారాలు టీకాలు వేయాల్సి ఉంది. మంగళ, శుక్రవారాలు గ్రామాల్లో టీకాలు వేయని వారి పేర్లు నమోదు చేసుకోవాలి. జ్వరాలు, డెంగీ,మలేరియా తదితర అంటువ్యాధులు పది మంది కంటే ఎక్కువ మందికి సోకినప్పుడు వెంటనే పరిధిలోని ఆరోగ్య కేంద్రాల వైద్యులకు తెలియజేసి వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలి. టీబీ రోగులు ఉంటే వెంటనే వైద్యశాలకు తరలించాలి. అమలు కాని జీఓ నంబర్ 98 రెండో ఏఎన్ఎంలతో పాటూ ఇతర వైద్య ఉద్యోగులు పని చేసేచోటే నివాసం ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ డెరైక్టర్ జీఓ నంబర్ 98 ద్వారా గత ఏడాది ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యంతో అమలు కావడం లేదు. చీరాల నియోజకవర్గ పరిధిలో... ఈపూరుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 17 మంది సెకండ్ ఏఎన్ఎంలు ఉండగా 16 మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. వీరిలో చాలా మంది ఒంగోలు, పర్చూరు, ఇంకొల్లు, తదితర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. కనిగిరిలో.. నియోజకవర్గంలోని సీఎస్‌పురం, పీసీపల్లి మండలాల్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో నియమించిన సిబ్బంది రాత్రి వేళల్లో అందుబాటులో ఉండటం లేదు. మార్కాపురంలో.. మార్కాపురం నియోజకవర్గ పరిధిలో సిబ్బంది కొరత ఉంది. వైద్య పరికరాలు పనిచేయడం లేదు. కొనకనమిట్లలో 8 ఏఎన్ఎం పోస్టులుండగా, రెండు ఖాళీగా ఉన్నాయి. కొంత మంది సిబ్బంది పొదిలిలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. అద్దంకి పరిధిలో.. నియోజకవర్గంలోని అద్దంకి, పంగులూరు, కొరిశపాడు, సంతమాగులూరు మండలాల్లో మొత్తం 59 మంది సెకండ్ ఏఎన్‌ఎంలున్నారు. మోదేపల్లి పీహెచ్సీ పరిధిలో 11 మంది సెకండ్ ఏఎన్ఎంలు ఉండగా వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ మోదేపల్లిలో నివాసం ఉండటం లేదు. కొరిశపాడు, పంగులూరు మండలాల్లోని సెకండ్ ఏఎన్ఎంలు కూడా హెడ్ క్వార్టర్స్‌లో నివాసం ఉండటం లేదు. సంతమాగులూరు మండలంలోని 11 మంది సెకండ్ ఏఎన్ఎంలు మార్టూరు,అద్దంకి, మేదరమెట్ల, నరసరావుపేటల్లో నివాసం ఉంటున్నారు. బల్లికురవ మండలంలోని ఏఎన్ఎంలు కూడా హెడ్ క్వార్టర్స్‌లో నివాసం ఉండడం లేదు.