వంట నిర్వాహకుడే మాస్టారు
వంట నిర్వాహకుడే మాస్టారు
Published Fri, Dec 30 2016 10:51 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
మిడుతూరు: చెరుకుచెర్ల ప్రాథమిక పాఠశాల (స్పెషల్)లో శుక్రవారం ఉపాధ్యాయులు గైర్హాజరు కావడంతో వంట నిర్వహకుడే పాఠశాలను నిర్వహణ బాధ్యతలు చేపట్టాడు. పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండగా విద్యార్థుల రోల్ తక్కువ నమోదు ఉండటంతో ఒకరిని టీచింగ్ ఆట్ రైట్ లెవల్‌పై శిక్షణా తరగతులకు రిసోర్స్ పర్సన్‌గా విద్యాశాఖ నియమించింది. విధులు నిర్వహించాల్సిన మరొక ఉపాధ్యాయురాలు సెలవుపై వెళ్లడంతో పాఠశాలకు వంట నిర్వాహకుడే దిక్కయ్యాడు. గతంలో ఉపాధ్యాయులు హాజరు కాకపోవడంతో మూతపడిన విషయంపై గ్రామ సర్పంచ్ మండల సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించినప్పటికీ ఉపాధ్యాయుల తీరు మారకపోవడం గమనార్హం. విషయంపై ఎంఈఓ మౌలాలిని వివరణ కోరగా టీచర్ సెలవు కావాలని కోరగా తాను అనుమతించలేదన్నారు. విచారణ చేపట్టి డీఈఓ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
Advertisement
Advertisement