ఆయనది అవినీతి దారి | corruption of a Superintendent | Sakshi
Sakshi News home page

ఆయనది అవినీతి దారి

Published Fri, Mar 10 2017 3:11 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

ఆయనది అవినీతి దారి

ఆయనది అవినీతి దారి

దేవుని సొమ్ము ఒక్క రూపాయి తిన్నా అరగాయించుకోలేరని పెద్దలు చెబుతుంటారు.

► టైపిస్టుగా చేరి సూపరింటెండెంట్‌గా ఎదిగి
►ఇదీ  వెల్లాల ఆలయాల  ఈఓ భాగోతం


ప్రొద్దుటూరు టౌన్ : దేవుని సొమ్ము ఒక్క రూపాయి తిన్నా అరగాయించుకోలేరని పెద్దలు చెబుతుంటారు. ఈ కోవలోకే వచ్చా డు వెల్లాల సంజీవరాస్వామి దేవాలయాల ఈఓగా పని చేసి సస్పెండైన మేకల రామాం జనేయులు. టైపిస్టుగా చేరి సూపరింటెండెం ట్‌ స్థాయికి ఎదిగిన  ఆయన డిప్యుటేషన్  పే రుతో జిల్లాలోని పలు ఆలయాలకు ఈఓగా పని చేశారు. ఎక్కడ పని చేసినా అధికార పార్టీనేతలతో చేతులు కలపడం, ఆలయ భూములను అక్రమ పద్ధతుల్లో లీజులకు ఇవ్వడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

మిట్టా పాపయ్య సత్రం...
ప్రొద్దుటూరు పట్టణం శివాలయం వీధిలో దాదాపు దాదాపు 50 సెంట్ల మిట్టాపాపయ్య సత్రానికి చెందిన స్థలాన్ని వాణిజ్య అవసరాల కోసం కొన్నేళ్ల కిందట అప్పటి ఈఓగా ఉన్న మేకల రామాంజనేయులు లీజుకు ఇ చ్చారు. ఈ స్థలంలో నందిని క్లాత్‌ మార్కెట్‌ పేరుతో నిర్మాణం పనులు మొదలెట్టారు. మూడు అంతస్తులు నిర్మాణం పూర్తయింది. దీనిపై మిట్టా పాపయ్య వంశీకులు కోర్టును ఆశ్రయించారు. దేవాలయ భూములను ఏవి ధంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారని కో ర్టు ప్రశ్నించి అనుమతులను రద్దు చేసింది.

వ స్త్ర దుకాణదారుల నుంచి లీజు హక్కులు పొంది న వారు భారీ మొత్తంలో అడ్వాన్స్ లు వసూలు చేశారు. అనుమతులు రద్దు కావడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో వ్యా పారులు తీవ్రంగా నష్టపోయారు. జీఓ ఎం ఎస్‌ నంబర్‌ 866 ఏపీ ఎండోమెంట్‌ యాక్టుకు విరుద్ధంగా నారాయణ రంగయ్య సత్రానికి చెందిన వ్యవసాయ భూమిని  లీజుకు ఇవ్వడంపై కూడా కోర్టు మొట్టికాయ వేసింది.

రాయచోటిలో...
 రాయచోటి వీరభద్రస్వామి ఆలయ ఈఓగా పని చేసిన సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని అప్పటి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. కర్ణాటక భక్తులు ఇచ్చిన డబ్బును ఆలయ అకౌంట్‌లో జమ చేయకుండా స్వాహా చేశాడని గ్రామస్తులు  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి నుంచి  తిరిగి ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.  ప్రొద్దుటూరులోని అగస్తే్యశ్వరస్వామి, చాపాడు మండలంలో ఉన్న అల్లాడుపల్లె ఆలయాలు, నారాయణ చౌల్ట్రీ, మిట్టాపాపాయ్య సత్రం స్థలాలకు సంబంధించి ఈఓగా పని చేసిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

వెల్లాలలో...
వెల్లాల సంజీవయరాయస్వామి దేవాలయా ల ఈఓగా పని చేస్తున్న సమయంలో శని వారాలు మాత్రమే గుడికి వచ్చేవాడు. భక్తులు అన్నదానానికి ఇచ్చే డబ్బును అకౌంట్‌లో రా సేవాడు కాదని, ఇక్కడ పని చేస్తున్న కొందరు అర్చకులతో  సత్సంబంధాలు పెట్టుకొని అవినీతికి పాల్పడేవారన్నా ఆరోపణలు  లేక పోలేదు. హైదరాబాదులో నివాసం ఉండటంతో ఎక్కువ సమయం అక్కడే గడిపేవాడని అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.

అలాగే గుడికి సంబంధించిన  సర్వే నెంబర్‌ 177లో 5.13 ఎకరాల స్థలంలో దేవాదాయ కమిషనర్‌ అనుమతులు లేకున్నా అక్కడ ఎత్తిపోతల పథకం పనులు  ప్రారంభించారు. ఈ పనుల్లో తన వాటాగా కొంత శాతం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా అవినీతి ఈఓపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అతని బాగోతం బయటపడుతుందని ఆశాఖలోని అధికారులే అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement