సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ రిలీవ్
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా బదిలీ అయిన నాగులపల్లి శ్రీకాంత్ సీఆర్‌డీఏ కమిషనర్ బాధ్యతల నుంచి గురువారం రిలీవ్ అయ్యారు. విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, అదనపు కమిషనర్ వీ రామమనోహరరావు, ల్యాండ్‌స్కేప్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ కే సూర్యనారాయణ, సీఈ డీ కాశీవిశ్వేశ్వరరావు తదితర ఉద్యోగులు ఆయనకు వీడ్కోలు పలికారు. శ్రీకాంత్ మాట్లాడుతూ సీఆర్‌డీఏ అధికారులు, ఉద్యోగులు తనకు ఎంతో సహకరించారన్నారు. ఇదేlవిధంగా శ్రీధర్‌కూ తోడుండి రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరారు. టీమ్ వర్క్‌తో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పాటుపడాలన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్లానింగ్, ప్రొక్యూర్‌మెంట్, ఫైనాన్స్ తదితర విభాగాలు ఎంతో కషి చేశాయని శ్రీకాంత్ ప్రశంసించారు. రానున్న కాలంలో 20 నుంచి 30 స్మార్ట్ సిటీలు నిర్మించాల్సి ఉందని చెప్పారు. ఇలాంటి నగరాల నిర్మాణంలో ఏపీ సీఆర్‌డీఏ భాగస్వామికావాలని ఆకాక్షించారు. ల్యాండ్ ప్రొక్యూర్‌మెంట్ విభాగంలో చెరుకూరి శ్రీధర్ బాగా కషి చేశారని, ఉద్యోగులు తమ వ్యక్తిగత సమయాన్ని కూడా వెచ్చించారని శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో డెవలప్‌మెంట్ కంట్రోల్ డైరెక్టర్ రాముడు, ఎకనామిక్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ నాగిరెడ్డి, ప్రొక్యూర్‌మెంట్ డైరెక్టర్ అంజనేయులు, ఆఫీస్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ మురళీధరరావు, ఎస్టేట్‌స డైరెక్టర్ మోహనరావు, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్ అరవింద్, ఇన్‌ఫ్రా ప్రిన్సిపల్ ప్లానర్ గణేష్‌బాబు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, ప్లానింగ్ ఆఫీసర్లు నాగేశ్వరరావు, వీవీఎల్‌ఎస్ శర్మ, హెచ్‌ఆర్ జాయింట్ డైరెక్టర్ సీ రోహిణి, భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డీ మనోరమ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.