
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకం
ప్రజాస్వామ్యంలో కీలకమైన చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని,
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ఓయూ జర్నలిజం విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు
కేయూక్యాంపస్: ప్రజాస్వామ్యంలో కీలకమైన చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, ప్రజలు ఇప్పటికి విశ్వసించేది మీడియానేని, అందుకే ప్రజాస్వామ్యంలో మీడియాపాత్ర ఎంతో కీలకమని ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ పీ.ఎల్. విశ్వేశ్వర్‌రావు అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్యాకేంద్రంలో సెమినార్‌హాల్‌లో సోమవారం బీసీజే, ఎంసీజే విద్యార్థులకు నిర్వహించిన ‘ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర’ అనే అంశంపై ఆయన పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణాలో అధికారంలోనికి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మీడియాలో కథనాలు రాయాలన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగకల్పన కోసమే తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ అధికారంలోనికి వచ్చి రెండున్నరేళ్లుగడిచినా ఇచ్చిన హామీలున నెరవేర్చలేదని విమర్శించారు. నీ«ళ్లు, నిధులు, నియామాకాల కోసం నిరీక్షిస్తున్న ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి రంగాలు ఘోరంగా విఫలమైందన్నారు. దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో జర్నలిజం పూర్తిచేసిన విద్యార్థులు వివిధ చోట్ల ఎలక్ట్రానిక్, పత్రికరంగంలో పనిచేస్తున్నారన్నారు. జర్నలిజం కోర్సు పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలున్నాయన్నారు. కార్యక్రమంలో జర్నలిజం కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ సంగాని మల్లేశ్వర్, జర్నలిజం విభాగం అధ్యాపకులు డాక్టర్ వీరాచారి, రామాచారి, శ్రీకాంత్‌యాదవ్, ఎస్.నర్సయ్య, కె.న ర్సింహులు, పద్మ, వంగాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.