యువకుడి మృతదేహం లభ్యం
Published Wed, Aug 31 2016 9:37 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
కోసిగి : తుంగభద్ర నదిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. శ్రావణ మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని కోసిగి మండలం కందుకూరు గ్రామ ఒడ్డున జరిగిన శ్రీలక్ష్మి నరసింహ (ఉరుకుంద ఈరన్న) స్వామి పల్లకోత్సవ ఉత్సవాలను తిలకించేందుకు∙కర్ణాటక రాష్ట్రం మాన్వి తాలుకా పొన్నూరు గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు పుట్టిలో వస్తున్నారు. మార్గమధ్యలో పుట్టి మునిగిపోగా ఆరుగురు యువకులు ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. యల్లమ్మ, హనుమయ్య దంపతుల కుమారుడు రాము(22) నదిలో కొట్టుకుపోయాడు. ఆ రోజు ఎంత గాలించినా ఆ యువకుడి ఆచూకీ లభించలేదు. మూడవ రోజు బుధవారం కందుకూరు సమీపంలో కర్ణాటక ప్రాంతం ఒడ్డున మతదేహం బయటపడింది. పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాన్వి ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement