
ఐదుకు చేరిన మృతుల సంఖ్య
– చికిత్స పొందుతున్న బాలుడు మృతి
గుర్రంపోడు
మండల పరిధిలోని కాల్వపల్లి శివారులో బుధవారం ఆర్టీసీ బస్సు– ఆటో ఢీకొట్టుకున్న ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మద్ది సాయి కిరణ్(12) గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఇతను ప్రమాదంలో మృతిచెందిన మద్ది శీనయ్య చిన్న కుమారుడు. మల్లేపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మద్ది శీనయ్యతో పాటు అన్న కుమార్తె మద్ది మౌనిక కూడా మృతి చెందగా ఇప్పుడు కుమారుడు కూడా మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని కలచివేసింది. గురువారం శాకాజిపురంలో శోకసప్త హృదయాలతో అంత్యక్రియలు జరిగాయి. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహ్మయ్య, జెడ్పీటీసీ గాలి రవికుమార్, సర్పంచ్ కాలం శ్రీదర్‌రెడ్డి, ఎంపీటీసీ పాశం గోపాల్‌రెడ్డిలు అంత్యక్రియల్లో పాల్గొని మృతుల కుటుంబాలను ఓదార్చారు.