అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
Published Mon, Dec 19 2016 12:09 AM | Last Updated on Fri, May 25 2018 7:10 PM
– ఆర్‌ఎస్‌ఎఫ్ కార్యాలయంలో పోస్టర్ల ఆవిష్కరణ
కర్నూలు (అర్బన్) : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని రాయలసీమ విద్యార్థి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు సంబంధించిన పోస్టర్లను ఆదివారం స్థానిక ఆర్‌ఎస్‌ఎఫ్ కార్యాలయంలో నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎఫ్ కో కన్వీనర్ దస్తగిరి మాట్లాడుతూ రాజధాని ప్రాంతాఇన్న ఫ్రీజోన్‌గా చేయాలని రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. సీఆర్‌డీఏ ద్వారా ఇటీవల కాంట్రాక్టు ప్రాతిపదికన 3వేల ఉద్యోగాలు, 200 కానిస్టేబుల్స్, గ్రూప్–2, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ ఉద్యోగాలు కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన వారికి మాత్రమే చెందుతున్నాయన్నారు. ఆర్టికల్ 371 (డీ) ప్రకారం రాజధాని ప్రాంతంలో అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వినోద్, నరసింహులు, పవన్, ప్రశాంత్, సంజీవరెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement