అనంతపురం ఎడ్యుకేషన్ : అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాలకు రూ. 200 అపరాధ రుసుంతో ఈ¯ð lల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆర్ట్స్ కళాశాల అధ్యయన కేంద్రం ఇన్‌చార్జ్ కోఆర్డినేటర్ ఎన్. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలతో పాటు ద్వితీయ, తృతీయ సంవత్సరం కోర్సు ఫీజులు చెల్లించాలని కోరారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.