ఏలూరు (మెట్రో) : రాష్ట్రంలోని ఆర్ అండ్ బి శాఖలో టెక్నికల్ అధికారులకు గెజిటెడ్ హోదా కల్పించాలని కోరుతూ ఆ శాఖ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక ఇరిగేషన్ అతిథి గహంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని సంఘ అధ్యక్షుడు ఎస్‌వీ సూర్యనారాయణరాజు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నికల్ అధికారులకు, ప్రత్యేక గ్రేడ్ కలిగిన టెక్నికల్ అధికారులకు గెజిటెడ్ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే ఆర్‌అండ్‌బీ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
సర్కిల్‌కు ఒక స్పెషల్ గ్రేడ్ టెక్నికల్ అధికారి పోస్టు మంజూరు చేయాలని, డివిజన్ పరిధిలో టెక్నికల్ మంజూరు అధికారాన్ని రూ.50 లక్షలు ఇవ్వాలని కోరారు. ఇతర డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.మురళి, కన్వీనర్ బి.చిరంజీవి, జనరల్ సెక్రటరీ ఎస్‌ఎల్ సోమయాజులు, ఫైనాన్స్ సెక్రటరీ ఆర్‌వీ భానుప్రసాద్, జిల్లా అధ్యక్షుడు పి.పూర్ణచంద్రరావు, జిల్లా కార్యదర్శి కె.దొర, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డి.సీతారామరాజు పాల్గొన్నారు
గెజిటెడ్ హోదా కల్పించాలి
Published Sun, Sep 25 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
Advertisement
Advertisement