నాటుమందు.. నమ్మితే కాటికే!
- పాముకాటుతో ప్రాణాలు కోల్పోతున్న వైనం
- ఏడాదిలో 300మందికిపైగా మృత్యువాత
- ముందస్తు జాగ్రత్తలే మేలంటున్న వైద్యులు
- ఆగస్టు 3న ధరూర్ మండలంలోని మాల్‌దొడ్డికి చెందిన చంద్రిక (4) ఇంట్లో నిద్రపోతుండగా పాటుకాటు వేయడంతో మృతి చెందింది.
- 4న మిడ్జిల్ మండలంలోని కొత్తూర్‌కు చెందిన శివకుమార్ (11) పాముకాటుతో మృతి చెందాడు.
- 6న కేశంపేట మండలం నిర్దవెల్లికి చెందిన గిద్దెల చిన్నకేశవులు (26) పాముకాటు వల్ల మృత్యువాతపడ్డాడు.
- 17వ తేదీ రాత్రి ధన్వాడ మండలం మాధ్వార్‌కు చెందిన ఆంజనేయచారి (35) పాముకాటుకు గురై మృత్యువాతపడ్డాడు. ఇదేరోజు తలకొండపల్లికి చెందిన అనిత (18) పాముకాటుతో‡మృతి చెందింది.
- కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దారెడ్డిచెరువుతండాకు చెందిన బాల్యనాయక్ (45) శివారులోని పొలంలో పశువులు మేపుతుండగా గడ్డిలో ఉన్న పాముకాటుకు బలయ్యింది.
- 18వ తేదీ రాత్రి ధన్వాడ మండలం రాంకిష్టాయపల్లికి చెందిన సరోజ(35) ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటుకు గురై చనిపోయింది.
- ఇటీవల వెల్దండలో పదేళ్ల బాలుడు చెట్ల పొదల్లో బంతికోసం వెతకగా పాము కాటేయడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
- పాము కాటేసిన వెంటనే విషం మనిషి శరీరంలోకి వెళ్లకుండా తాడుతో లేక ఇతర గుడ్డముక్కలతోనైనా కాటేసిన చోట పైన కట్టాలి. ఆ వెంటనే చికిత్సకు తరలించాలి.
- మూఢనమ్మకాలను నమ్మి మంత్రం వేసిన నీళ్లు తాగడమో, భూమిలో కాలుపెట్టి చికిత్స తీసుకోవడమే చాలాచోట్ల చేస్తుంటారు. వీటికి దూరం ఉండి తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
- పాము కాటేసిన వెంటనే చాలామంది భయంతోనే ప్రాణాలను మీదకి తెచ్చుకుంటున్నారు. భయపడొద్దని చికిత్స ఉంటుందని నిర్భయంగానే ఆస్పత్రికి బాధితులు రావాలని వైద్యులు సూచిస్తున్నారు.
- చేనులోకి వెళ్లిన సమయంలో చెట్లపొదల్లో అడుగు పెట్టేది ఉంటే కాళ్లకు పెద్ద సైజులో ఉండేలా నల్లని బూట్లు ధరించాలి.
- పొలం పొదల్లో పనిచేసే సమయంలో చేతులకు గ్లౌజులు ధరించాలి.
- పిల్లలను పొదలు ఎక్కువగా ఉన్నచోట ఆడుకోవడానికి పంపించరాదు.
- పల్లెల్లో ఇళ్ల పరిసరాలు చుట్టూ చెట్లపొదలు ఎక్కువగా ఉండనివ్వకుండా చూసుకోవాలి.
- ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో చాలా వరకు పాములు బయటకొచ్చే అవకాశాలుంటాయి. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
- పాము కరిచిన పై భాగాన తాడుతో గాని, గుడ్డతో కానీ గట్టిగా కట్టు కట్టాలి. కాటువేసిన ప్రాంతంలో రక్తం బయటకు వెళ్లేలా చిన్నపాటి రంధ్రం వేయాలి. వెంటనే పరిగెత్తకుండా అలాగే కూర్చోవాలి.