దళితవాడల అభివృద్ధిలో వివక్ష | Discrimination in the development of sc colony | Sakshi
Sakshi News home page

దళితవాడల అభివృద్ధిలో వివక్ష

Published Sun, Jul 17 2016 9:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

దళితవాడల అభివృద్ధిలో వివక్ష

దళితవాడల అభివృద్ధిలో వివక్ష

రాష్ట్ర ప్రభుత్వం దళిత వాడల అభివృద్ధిలో వివక్ష చూపుతుందని కేవీపీఎస్‌ జిల్లా కమిటీ సభ్యుడు దొంతాల నాగార్జున అన్నారు.

ఊట్లపల్లి(పెద్దవూర): రాష్ట్ర ప్రభుత్వం దళిత వాడల అభివృద్ధిలో వివక్ష చూపుతుందని కేవీపీఎస్‌ జిల్లా కమిటీ సభ్యుడు దొంతాల నాగార్జున అన్నారు. ఆదివారం మండలంలోని ఊట్లపల్లి, లింగంపల్లి, తెప్పలమడుగు, పోతునూరు గ్రామాల్లో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత వాడలలో మౌలిక వసతులు లేక దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుబ్బ పరమేశ్, చిలుముల దుర్గయ్య, బొడ్లు ఎల్లయ్య, బక్కయ్య, పెదమల్లయ్య, నాగరాజు, శ్రీను, శ్రీదేవి, రాములు, రామస్వామి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement