
నారాయణ కాలేజీలో విద్యార్థుల మద్య ఘర్షణ
విశాఖపట్టణం: నగరంలోని నారాయణ జూనియర్ కాలేజీ లో విద్యార్థులు రెండు వర్గాలు చీలిపోయి కొట్టుకున్నారు. ఈ ఘటన వైజాగ్‌లోని అసిలిమెట్ట నారాయణ జూనియర్ కాలేజీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఓ వర్గం విద్యార్థులు మరో వర్గం విద్యార్థులపై దాడి చేయడంతో ఈ వివాదం మొదలైనట్లు సమాచారం. దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు పలువరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే కళాశాల యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.