జిల్లా కలెక్టర్‌ బదిలీ | District collector transferred | Sakshi
Sakshi News home page

జిల్లా కలెక్టర్‌ బదిలీ

Published Tue, Apr 18 2017 1:48 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

జిల్లా కలెక్టర్‌ బదిలీ - Sakshi

జిల్లా కలెక్టర్‌ బదిలీ

నూతన కలెక్టర్‌గా ప్రద్యుమ్న
ప్రకాశం కలెక్టర్‌గా వినయ్‌చంద్‌


తిరుపతి: జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ జైన్‌ బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆయనను రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌గా నియమించింది. కాగా నూతన కలెక్టర్‌గా ప్రస్తుతం సీఎం పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నప్రద్యుమ్న బాధ్యతలు చేపట్టనున్నారు. రాత్రి 11 గంటల వరకూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయలేదు. సేకరించిన సమాచారం ప్రకారం జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ సెక్రటరియేట్‌కు బదిలీ కాగా, తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌గా కొనసాగుతున్న వినయ్‌చంద్‌ను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.

2010 మార్చి నుంచి 2011 మార్చి వరకూ చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా  ప్రద్యుమ్న కొనసాగారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వానికి అనుకూలంగా సహకారం అందించాలని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రద్యుమ్నపై ఒత్తిడి తెచ్చింది. అయినప్పటికీ ఆయన నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయనను బదిలీ చేశారు. తిరిగి మళ్లీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ వినయ్‌చంద్‌ తాజా బదిలీల్లో ప్రకాశం కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. తిరుపతి  కమిషనర్‌గా ఎవరికి పోస్టింగ్‌ ఇచ్చారో తెలియలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement