హరితహారానికి రూ.రెండు లక్షల విరాళం | district officers donted Rs. 2laxs for haritaharm | Sakshi
Sakshi News home page

హరితహారానికి రూ.రెండు లక్షల విరాళం

Published Tue, Jul 19 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

district officers donted Rs. 2laxs for haritaharm

ముకరంపుర: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా తీసుకున్న జిల్లా అధికారులు చేయూతనందించారు. జిల్లా అధికారుల సంఘం తరఫున రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. జిల్లా అధికారులందరూ మూడు రోజుల వేతనాన్ని విరాళంగా సమకూర్చారు. ఈ మేరకు కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో కలెక్టర్‌ నీతూప్రసాద్, జేసీ శ్రీదేవసేనకు అంగీకార లేఖ అందిందించారు. ఈ మొత్తాన్ని కరీంనగర్‌ పట్టణంలో చెట్ల సంరక్షణ, ట్రీగార్డుల కొనుగోలుకు ఉపయోగించాలని కోరారు. కలెక్టర్‌ అధికారులను కలెక్టర్‌ అభిన ందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, హౌసింగ్‌ పీడీ నర్సింగరావు, డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య, ఉద్యానశాఖ డీడీ సంగీత లక్ష్మి, సీపీవో సుబ్బారావు, జెడ్పీ సీఈవో సూరజ్, డీఎస్‌వో నాగేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement