దివ్యదర్శనం ప్రారంభం
– తొలిసారిగా 110 మంది భక్తులకు అవకాశం
కర్నూలు (న్యూసిటీ): దివ్యదర్శనం కార్యక్రమాన్ని సోమవారం కర్నూలు సప్తగిరి నగర్‌లోని మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర దర్శనం పాప నాశనం అన్నారు. దివ్యదర్శనం భక్తులకు బస, ఆహారం వసతులను దేవాదాయ శాఖ ఉచితంగా కల్పిస్తుందన్నారు. ఏడాదిలో పదివేల మంది భక్తులకు ఈ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. దివ్యదర్శనానికి వెళ్లే భక్తుల్లో రోగులు ఉంటే మందులను వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు.
కర్నూలు నుంచి నాలుగు ఆర్టీసీ బస్సులో 110 మంది భక్తులు తరలి వెళ్లారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఉప కమిషనర్ బి.గాయత్రిదేవి, సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి , శ్రీమణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధాన కార్యదర్శి ఇ.మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.