
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
మహబూబ్నగర్ : తన సోదరుడు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డిపై దాడి చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జి బాలరాజుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రభుత్వానికి సూచించారు. శనివారం మహబూబ్నగర్లో డీకే అరుణ మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కులం పేరుతో దాడికి దిగడం తగదని డీకే అరుణ అన్నారు. ఇలాంటి వ్యక్తులతో బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారో ఆలోచించాలని కేసీఆర్కు డీకే అరుణ హితవు పలికారు.