క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళం
క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళం
Published Fri, Nov 25 2016 11:16 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(అర్బన్):
నగరంలోని ఇండియన్ రెడ్‌క్రాస్ క్యాన్సర్ ఆస్పత్రికి హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ కంపెనీ రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రిలో ఆ కంపెనీ చైర్మ , ఎండీ మంతెన వెంకటరామరాజు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆస్పత్రి పేద రోగులకు సేవలు చేస్తున్నందున తాను విరాళం అందచేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎవీ సుబ్రహ్మణ్యం, గాంధీ ఆశ్రమం కన్వీనర్ కృష్ణారెడ్డి, మహావీర్ జైన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి జేపీ జైన్, డాక్టర్ లక్ష్మీ, కన్యాకుమారి పాల్గొన్నారు.
Advertisement
Advertisement