వజ్ర మినీ బస్సులో అశ్లీల చిత్రాలు | driver cought after watchin abusive videos while driving | Sakshi
Sakshi News home page

వజ్ర మినీ బస్సులో అశ్లీల చిత్రాలు

Published Wed, Jul 5 2017 2:05 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

వజ్ర మినీ బస్సులో అశ్లీల చిత్రాలు

వజ్ర మినీ బస్సులో అశ్లీల చిత్రాలు

ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు
సర్ది చెప్పి పంపించిన అధికారులు


జనగామ:
ఆర్టీసీ సంస్థ ఇటీవల ప్రవేశపెట్టిన మినీ వజ్ర బస్సులో డ్రైవర్‌ నీలి చిత్రాలు చూస్తూ నడుపుతున్నాడని ఓ ప్రయాణికుడు జనగామ డిపోలో మంగళవారం ఫిర్యాదు చేశాడు. వరంగల్‌–2 డిపోకు చెందిన టీఎస్‌ 03 జెడ్‌ 0340 నంబరు గల వజ్ర బస్సు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వెళ్తుంది.  ప్రయాణికుడు నాగలింగం ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. బస్సు స్టేషన్‌ఘన్‌పూర్‌ దాటగానే కుదుపుకు లోనయిందన్నారు. అనుమానం వచ్చి చూడడంతో నావిగేషన్‌ కోసం ఉపయోగిస్తున్న ట్యాబ్‌లో నీలి చిత్రాలు చూస్తున్నట్లు గమనించడం జరిగిందన్నారు. వెంటనే బస్సు ఆపి డ్రైవర్‌ను నిలదీయడంతో తమనే బెదిరించే ప్రయత్నం చేయడంతో బస్సుతో సహా తీసుకెళ్లి జనగామ డిపోలో అధికారులకు ఫిర్యాదు చేశారు.

డ్రైవర్‌ బుకాయించడంతో ట్యాబ్‌లోని యూ ట్యూబ్‌లో ఉన్న నీలి చిత్రాలకు సంబంధించి వీడియోలను చూపించారు. నావిగేషన్‌ కోసం ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేస్తే నీలిచిత్రాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలి చిత్రాలను చూడలేదని చెబుతున్న డ్రైవర్‌ యూ ట్యుబ్‌ తెరవగానే అవి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయని అధికారులను ప్రశ్నించారు. ఫిర్యాదు అందుకున్న హెడ్‌కానిస్టేబుల్‌ ఆర్‌.ప్రకాష్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫోన్‌ ద్వారా విషయాన్ని వివరించారు. నాగలింగం తమకు ఫిర్యాదు చేశాడని  ప్రకాష్‌ తెలిపారు.

ఆర్టీసీ అధికారులకు ట్యాబ్‌ను చూపిస్తున్న ప్రయాణికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement