పెన్నాలో మునిగిన యువకుడు | Drowned youth rescued by Fire tenders | Sakshi
Sakshi News home page

పెన్నాలో మునిగిన యువకుడు

Nov 23 2016 1:21 AM | Updated on Sep 18 2019 3:24 PM

పెన్నాలో మునిగిన యువకుడు - Sakshi

పెన్నాలో మునిగిన యువకుడు

నెల్లూరు(క్రైమ్‌) : బహిర్భూమికి వెళ్లిన ఓ యువకుడు మంగళవారం పెన్నానదిలో మునిగిపోయాడు. ఈవిషయంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతికష్టంపై సదరు యువకుడిని రక్షించారు.

  • రక్షించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
  • నెల్లూరు(క్రైమ్‌) : బహిర్భూమికి వెళ్లిన ఓ యువకుడు మంగళవారం పెన్నానదిలో మునిగిపోయాడు. ఈవిషయంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతికష్టంపై సదరు యువకుడిని రక్షించారు. వివరాలు.. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన బొల్లేపల్లి శ్రీనివాసులు నెల్లూరు ఆటోనగర్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం అతను పెన్నానది వద్ద బహిర్భూమికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో స్థానికులు గమనించి మూడోనగర పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడోనగర ఎస్‌ఐ రామకృష్ణ, నెల్లూరు అగ్నిమాపక కార్యాలయ అధికారి పి.శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన పెన్నానదికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది రోప్‌ల సహాయంతో నీటిలో దిగి నీటమునిగిన శ్రీనివాసులను అతికష్టంపై రక్షించారు. అప్పటికే అతను నీరు తాగివేయడంతో అతనికి ప్రథమచికిత్స చేశారు. శ్రీనివాసులను రక్షించిన మూడోనగర ఎస్‌ఐ, అగ్నిమాపక అధికారి, అగ్నిమాపక సిబ్బంది రియాజ్, జె.వెంకటేశ్వర్లు, పి.మధు, రాజేష్‌లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement