ఈతకు వెళ్లి యువకుడి మృతి | Student Dies in Penna River in Nellore | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి యువకుడి మృతి

Published Fri, May 5 2017 3:58 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

ఈతకు వెళ్లి యువకుడి మృతి - Sakshi

ఈతకు వెళ్లి యువకుడి మృతి

నెల్లూరు రూరల్‌ : సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన పెన్నానది వారధి వద్ద చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. కోవూరు మండలంలోని మోడెగుంటకు చెందిన చిన్నయ్య కుమారుడు భీమతాటి శివకిషోర్‌(26)బీటెక్‌ పూర్తిచేశాడు. మరో 20రోజుల్లో సింగపూర్‌లో ఉద్యోగ నిమిత్తం వెళ్లాల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నం పెన్నానదికి ఈతకొట్టేందుకు వెళ్లాడు. అక్కడ నుంచి అతని స్నేహితుడు దిలీప్‌కు ఫోన్‌ చేసి ఈతకు రావాల్సిందిగా కోరాడు. అయితే తను రావడం ఆలస్యమవుతుందని అతను సమాధానం ఇచ్చాడు.

దీంతో శివకిషోర్‌ తన దుస్తులను, బైక్‌ను, పర్స్‌ను పక్కన పెట్టి  ఒక్కడే ఈతకు వెళ్లాడు. కొంత సేపటికి అతని స్నేహితుడు దిలీప్‌ వచ్చి  చూడగా శివకుమార్‌ ఆచూకి కనిపించలేదు. పెన్నానదిలో గల్లంతై ఉంటాడని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. గజ ఈతగాళ్లతో పోలీసులు గురువారం మృతదేహన్ని వెలికితీశారు. ఘటన స్థలాన్ని రూరల్‌ ఎస్‌ఐ రామ్మూర్తి పరిశీలించారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement