Published
Wed, Jul 5 2017 12:12 AM
| Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
‘చెత్త’ ఐడియా
శ్రీశైలం: శ్రీశైలంలో వ్యాపారాల ద్వారా జీవనోపాధి పొందుతూ దేవస్థానం క్వాటర్స్‌లో నివాసం ఉంటున్న కొందరు దుకాణాదారులు తమ నివాసిత గృహాలను ఖాళీ చేయకపోవడంతో మంగళవారం ఇలా చెత్తసేకరించే వాహనాలను షాపుల ముందు అడ్డంగా పెట్టేశారు. దేవస్థానం సిబ్బంది కోసం వసతి గృహాలు అవసరం కావడంతో ఖాళీ చేయాలని ఈఓ నారాయణ భరత్ గుప్త అనేకమార్లు ఆదేశించినా ఫలితం లేకపోవడంతో తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఏఈఓ ధనుంజయ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం తొలిఏకాదశి రోజున షాపులు తెరిచిన వెంటనే చెత్తసేకరించుకొని వచ్చిన వాహనాలను సంబంధిత దుకాణాలకు అడ్డంగా పెట్టించేశారు. దీంతో ఆయా దుకాణాదారులు ఈఓను కలవగా వారికి కేటాయించిన దేవస్థానం వసతిగృహాలను ఖాళీ చేయాల్సిందిగా సూచించారు. అందుకు వారు సమ్మతించడంతో దుకాణాలకు అడ్డంగా నిలిపివేసిన వాహనాలను తొలగించారు.